Prabhas | కృష్ణంరాజు–ప్రభాస్ ఆహార రహస్యాలు బయటపెట్టిన శ్యామలాదేవి.. పులస చేపల పులుసు ఫుల్ ఇష్టం..!
Prabhas | దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి తాజాగా కృష్ణంరాజు వ్యక్తిత్వం, ఆహార అలవాట్లు, అలాగే మేనల్లుడు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ విషయాలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కృష్ణంరాజు భోజనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో శ్యామలాదేవి వివరించారు.
Prabhas | దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి తాజాగా కృష్ణంరాజు వ్యక్తిత్వం, ఆహార అలవాట్లు, అలాగే మేనల్లుడు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ విషయాలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కృష్ణంరాజు భోజనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో శ్యామలాదేవి వివరించారు. ఇంటికి వచ్చిన అతిథుల అభిరుచులను ముందుగానే తెలుసుకుని, వారికి నచ్చిన వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించేవారని చెప్పారు. చేపల పులుసు, బిర్యానీ, రొయ్యల కూర, పులావ్–రసం కలయిక ఆయనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.ముఖ్యంగా పులస చేపల పులుసు అంటే కృష్ణంరాజుకు అమితమైన ఇష్టం. గోదావరి జిల్లాల నుంచి మంచి పులస చేప దొరికితే వెంటనే తెప్పించి వండించేవారని తెలిపారు. ఆ వంటకాన్ని ఎలా తయారు చేయాలో కూడా తనకే నేర్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.
ప్రభాస్ కూడా పులస చేపల పులుసుకు పెద్ద అభిమానినే అని శ్యామలాదేవి తెలిపారు. డైట్లో ఉన్నప్పటికీ, “పెద్ద బాజి.. ఈరోజు నాకు చీట్ డే” అంటూ ఇష్టంగా తినేవాడని నవ్వుతూ చెప్పారు. కృష్ణంరాజు వంటకాలను రుచి చూడకుండానే కేవలం వాసనతోనే ఉప్పు సరిపోయిందా లేదా చెప్పగలిగేవారని శ్యామలాదేవి వెల్లడించారు. ఇది ఆయనకు ఉన్న ప్రత్యేకమైన గుణమని చెప్పారు. కృష్ణంరాజు అతిథి సత్కారంలో ఎంతో ముందుండేవారని, విదేశాల నుంచి వచ్చిన స్నేహితులకూ వారి అభిరుచులకు తగ్గ వంటకాలు చేయించేవారని చెప్పారు. షాపింగ్ విషయంలో కూడా ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉండేదని, నచ్చిన వస్తువులు దొరికితే డజన్ల కొద్దీ కొనేవారని వివరించారు.
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులకు ఎన్నో బహుమతులు తీసుకొచ్చేవారని, ముఖ్యంగా ప్రభాస్ ఇచ్చిన రోలెక్స్ వాచ్‌ను ఎంతో ప్రేమగా చూసుకునేవారని తెలిపారు. కృష్ణంరాజు మరణం తర్వాత కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నప్పుడు, ప్రభాస్ తనకు ఎంతో ధైర్యం ఇచ్చాడని శ్యామలాదేవి అన్నారు. కుటుంబాన్ని దగ్గరగా ఉంచి, మానసికంగా నిలబెట్టాడని చెప్పారు. ప్రభాస్ కూడా తన పెదనాన్నలా భోజనప్రియుడేనని శ్యామలాదేవి తెలిపారు. షూటింగ్ సెట్లో ఒంటరిగా తినకుండా, 10–20 మందితో కలిసి భోజనం చేయడం అతని అలవాటని చెప్పారు. అందరికీ భోజనం పెట్టడం అతని ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభాస్ కోసం ప్రత్యేక కుకింగ్ టీమ్ ఉంటుందని, రోజుకు లక్షల రూపాయల విలువైన వంటకాలు సిద్ధం చేసి యూనిట్ సభ్యులకు వడ్డిస్తారనే సమాచారం కూడా వినిపిస్తోంది. మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటి వంటకాలు ఎక్కువగా మెనూలో ఉంటాయని తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

