సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా కీలకం. ముఖ్యంగా కమర్షియల్ సినిమాకు సరైన ఇంటర్వెల్ పడితే, ఆడియన్‌కి సెకండాఫ్‌పై అమాంతం హైప్ పెరిగిపోతుంది. అదే లక్ష్యంతో ఇప్పుడు ‘ఫౌజీ’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్లాన్ చేశారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ శివార్లలో వేసిన ‘ఆచార్య’ సెట్లో ‘ఫౌజీ’లోని అత్యంత కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్‌ని చిత్రీకరించబోతున్నారు. సినిమా మొత్తానికీ టర్నింగ్ పాయింట్లా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈ ఎపిసోడ్ కోసం ముందు కొన్నిరోజులు యూనిట్‌తో రిహార్సల్స్ చేయించినట్టు వినికిడి.
కెమెరా యాంగిల్, ఫైట్ మూమెంట్, డైలాగ్ మూమెంట్, టోటల్ షాట్.. ఇలా ప్రతి విషయంపై క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయించి, పక్కాగా ఫైనల్ అయ్యాకే, సంతృప్తిగా రేపు సెట్‌కి వెళ్తున్నారట. ఒక్క ఎపిసోడ్ కోసం టీమ్ ఇంత కష్టపడుతున్నదంటే ఈ సీక్వెన్స్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో ప్రభాస్‌కి ఇచ్చే ఎలివేషన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానున్నదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.