తుదిదశలో ‘ఫౌజీ’
అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేమ, దేశభక్తి, యుద్ధం మిళితమైన కథతో దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో తిరుగుబాటుదారుడిగా మారిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారు.
అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేమ, దేశభక్తి, యుద్ధం మిళితమైన కథతో దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో తిరుగుబాటుదారుడిగా మారిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారు. ఇమాన్వి కథానాయిక. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకున్నది.
ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని కూడా విడుదల చేయనున్నారు. ఆ గ్లింప్స్ ద్వారా సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ మూవీలో అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుందని, మునుపెన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ఇన్సైడ్ టాక్. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

