హైదరాబాద్ : సలార్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ (Prabhas) కొత్త ఏడాదిలో చేయనున్న సినిమాలు, సలార్ 2పై కీలక వివరాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు సలార్ వసూళ్లు చేరువవడంతో మూవీ గ్రాండ్ సక్సెస్ను ఆస్వాదిస్తున్న రెబల్ స్టార్ ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
సలార్ పార్ట్ 2 స్టోరీ సిద్ధమైందని, త్వరలోనే మూవీని సెట్స్ పైకి తీసుకువెళతామని చెప్పారు. ఈ మూవీని అభిమానులు, ప్రేక్షకుల కోసం వీలైనంత తక్కువ సమయంలో థియేటర్లలోకి తీసుకురానున్నామని తెలిపారు. సలార్ పార్ట్ 2 వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
2024లో పలు జానర్లలో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నా పని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించడమే తన ధ్యేయమని అన్నారు. తన తర్వాతి సినిమాలు ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఒకటి కాగా మరొకటి హారర్ ఫిల్మ్ అని రెబల్ స్టార్ వెల్లడించారు.
Read More :
Guntur Kaaram | ఆ బాధ్యత అభిమానులదే.. గుంటూరు కారం నిర్మాత నాగవంశీ కామెంట్స్ వైరల్