Prabhas Chit Chat| శ్రీదేవి సోడా సెంటర్ టీంతో ప్రభాస్ చిట్ చాట్..వీడియో
టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). పలాస ఫేం కరుణకుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో స్పెషల్ చిట్ చాట్ చేసింది టీం.

టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). పలాస ఫేం కరుణకుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంది (Anandhi) హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుధీర్ బాబు అండ్ డైరెక్టర్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో స్పెషల్ చిట్ చాట్ చేసింది టీం. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ హీరో, డైరెక్టర్ ను సినిమాకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నాడు.
మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజయ్ చెప్తుంటాడు. చెన్నైలో ఎక్కడో టిఫిన్ సెంటర్ నుంచి మొదలయిందట మీ లైఫ్ అంటూ ప్రభాస్ డైరెక్టర్ కరుణ కుమార్ ను అడిగాడు. దీనికి కరుణకుమార్ స్పందిస్తూ.. నేను ఇళయరాజా , ఏసుదాసు ఇంట్లో పనిచేశాను. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. చెన్నై నుంచి వచ్చాక మ్యారేజ్ అయిన తర్వాత ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉండేవాడిని. కథలు, కథనాలు రాయడం అంటే ఆసక్తి ఉండేది. వాటిని పత్రికలను పంపించడంతో పేరొచ్చింది. స్టాండప్ కామెడీ అనేది ఓ సారి ప్రయత్నించాను. మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత నాలుగు షోలు గెలవడం జరిగింది.
షోకు జడ్జిలుగా తమ్మారెడ్డి భరద్వాజ, హర్షవర్దన్ లాంటి వ్యక్తులు వచ్చేవారు. షో పూర్తయిన తర్వాత ఒకాయన నన్ను పిలిచి మీరేమైనా సినిమాలకు ట్రాక్ రాస్తారా..? అని నన్ను అడిగాడు. అలా సినిమాలకు రాయడం మొదలైంది. అలా కొన్ని సినిమాలకు ఘోస్ట్ గా పనిచేశాను. అనంతరం ప్రశాంత్ శర్మ అ సినిమా కోసం నాతో రాయించారు. నా పేరు స్క్రీన్ పై పడ్డ తొలి సినిమా ఇది. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సుధీర్ బాబులో ఇప్పటివరకు లేని కామెడీ యాంగిల్ ను చూస్తారని అన్నాడు కరుణకుమార్.చిట్ చాట్ లో ప్రభాస్ ఇంకా ఏం మాట్లాడాడో ఓ లుక్కేయండి.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

