Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
Poonam Kaur | టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్‌కు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్న పూనమ్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Poonam Kaur | టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్‌కు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్న పూనమ్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగారని, వారి ద్వారా తనకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పించారని ఆమె ఆరోపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా పోస్టులో పూనమ్ కౌర్ తన కుటుంబానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన కుటుంబం ద్వారా ఎన్ని ప్రకటనలు ఇప్పించినా, వాటికి తాను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు చేసిన పనులకు తమ కుటుంబం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆమె పేర్కొన్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. అవసరం వచ్చినప్పుడు తమ కుటుంబాన్ని ఉపయోగించుకోవడం, సమస్య ఎదురైనప్పుడు పక్కకు తప్పుకోవడం సరికాదంటూ ఆమె తీవ్రంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలకు దారితీసిన పూర్తి నేపథ్యం ఏమిటనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ వివాదంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవహరిస్తున్న తీరుపైనా పూనమ్ కౌర్ ప్రశ్నలు సంధించింది. త్రివిక్రమ్‌పై వస్తున్న ఆరోపణల విషయంలో అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని ఆమె నిలదీసింది.
అమాయకుల జీవితాలకు నష్టం జరుగుతున్నా సంబంధిత వ్యక్తులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే అర్థంలో ఆమె ప్రశ్నలు లేవనెత్తినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.దీంతో పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పూనమ్ కౌర్ గతంలోనూ సోషల్ మీడియా వేదికగా కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం అప్పుడప్పుడు వార్తల్లో నిలిచింది. తాజాగా త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసినట్లు ప్రచారం రావడంతో ఈ వివాదంపై ఆసక్తి పెరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

