Poonam Kaur | టాలీవుడ్లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం… ఎన్నారై యువతి ఆరోపణలపై పూనమ్ కౌర్ ఘాటు స్పందన
Poonam Kaur | టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి ‘క్యాస్టింగ్ కౌచ్’ అంశం సంచలనంగా మారింది. సినిమా అవకాశాల పేరుతో నటీమణులను వేధించే ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నప్పటికీ… తాజాగా ఒక ఎన్నారై యువతి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.
Poonam Kaur | టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి ‘క్యాస్టింగ్ కౌచ్’ అంశం సంచలనంగా మారింది. సినిమా అవకాశాల పేరుతో నటీమణులను వేధించే ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నప్పటికీ… తాజాగా ఒక ఎన్నారై యువతి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగు మూలాలున్న ఇన్ఫ్లుయెన్సర్ పికు నెమలి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె టాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాత తనను సినిమా అవకాశాల పేరుతో వేధించారని ఆరోపించారు. తనను కలవడానికి ఒక రిసార్ట్‌కు రావాలని ఒత్తిడి చేశారని, ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాలను బయటపెడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.
ఈ వివాదంపై ఫైర్‌బ్రాండ్ నటి పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించారు. మహిళల సమస్యలపై ఎప్పుడూ గళమెత్తే ఆమె… ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సావిత్రి, జయప్రద, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య వంటి గొప్ప నటీమణులు ఎందుకు లేరో చెప్పడానికి కారణం ఇదే అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు రాకపోవడానికి ఇలాంటి పరిస్థితులే కారణమని పూనమ్ పేర్కొన్నారు. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్త సమస్య కాదు. గతంలో కూడా పలువురు నటీమణులు ఈ అంశంపై మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవకాశాల కోసం లైంగికంగా వేధించడం, ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
పూనమ్ కౌర్ వ్యాఖ్యల చెప్పినదాని ప్రకారం… ఇలాంటి వేధింపుల వల్లే ఎంతోమంది ప్రతిభావంతమైన యువతులు ఇండస్ట్రీలోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారని, లేదా మధ్యలోనే కెరీర్‌ను వదిలేస్తున్నారని అర్థమవుతోంది. ఈ ఘటనపై నెటిజెన్స్ రెండు వర్గాలుగా చర్చిస్తున్నారు. ఒక వర్గం పూనమ్ కౌర్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, ఇండస్ట్రీలో పారదర్శకత అవసరమని చెబుతుండగా… మరో వర్గం ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుతోంది. ఈ తాజా ఘటన మరోసారి టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ముందుకు తెచ్చింది. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చకు దారితీయగా… భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

