హృదయాన్ని చదివేశా!
ఎదుటివారి వ్యక్తిత్వాలను వారి ముఖకవళికలు, హావభావాల ద్వారా ఇట్టే పసిగట్టేస్తానని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తనలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల సహచర నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగిపోతుందని
ఎదుటివారి వ్యక్తిత్వాలను వారి ముఖకవళికలు, హావభావాల ద్వారా ఇట్టే పసిగట్టేస్తానని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తనలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల సహచర నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగిపోతుందని చమత్కరించింది. హిందీలో ఈ భామ సల్మాన్‌ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాళీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొవిడ్ ప్రభావంతో డిసెంబర్ 30కి వాయిదా పడింది. సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోతో కలిసి తొలిసారి తెరను పంచుకోవడం జీవితకాల అనుభవమని పూజాహెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం చేసిన ప్రయాణంలో సల్మాన్‌ఖాన్ అంతరంగాన్ని అర్థం చేసుకున్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘సల్మాన్ అద్భుతమైన వ్యక్తి. తన మనసులో ఏదీ దాచుకోడు. వ్యక్తులు నచ్చితే వారిని ఎంతగానో గౌరవిస్తాడు. ఆ భావన ఆయన కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టం లేని మనుషులకు చాలా దూరంగా ఉంటాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన హృదయాన్ని చదివేశా’ అని చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘ఆచార్య’, తమిళంలో ‘బీస్ట్’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

