Sita Ramam Movie | ‘సీతారామం’ కథ ముందుగా ఆ స్టార్ హీరోయిన్ దగ్గరకు వెళ్ళిందా?
Sita Ramam Movie | ‘తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి’ అని సాధరణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో నటీనటుల దగ్గరకు వచ్చే కథలపై వాళ్ళ పేరు రాసిపెట్టుండాలి అంటుంటారు. ఇదే కోవలో వచ్చిన లేటెస్ట్ చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. తెలుగులో మొదటి సినిమానే అయినా తన నటన, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచింది. సీతామహాలక్ష్మీ క్యారెక్టర్లో జీవించింది. హనురాఘవపూడి ఈ పాత్రను రాసిన విధానం చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో బాగా రాసిన క్యారెక్టర్లలో ఇది ఒకటి. కాగా ఈ కథ ముందుగా ఓ స్టార్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళిందట. కానీ ఆ హీరోయిన్ నో చెప్పిందట.
ఇంతకీ ఎవరా? హీరోయిన్ అనుకుంటున్నారా? తను మరెవరో కాదు పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే. సీత పాత్ర కోసం హనురాఘవపూడి ముందుగా పూజా హెగ్డేని సంప్రదించాడట. కానీ ఈ అమ్మడు డేట్స్ కారణంగా ఈ సినిమాను వదులుకుందట. ప్రస్తుతం ఈ సినిమా విజయం చూసి పూజా తెగ ఫీలై పోతుందట. ప్రస్తుతం పూజాను ఫ్లాపులు వెంటబడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఈమె నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలాయి. అయితే వరుసగా మూడు ఫ్లాప్‌లు పడిన ఈమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండతో జనగణమన కాగా మరో రెండు సర్కస్, కబీ ఈద్ కబీ దివాళి. ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

