Pooja hegde | పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజాహెగ్డే?
Pooja hegde | ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న కథానాయిక పూజాహెగ్డే. గతేడాది వరుస హిట్లతో జోరుమీదున్న పూజా ఈ ఏడాది మాత్రం వరుస ఫ్లాప్‌లతో కాస్త నిరాశ చెందింది. కానీ ఈవిడ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస ఫ్లాప్‌లు వచ్చిన సరే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇక ఈమె పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ దీని తర్వాత తమిళ రీమేక్ ‘వినోదయ సిత్తం’ షూటింగ్ ప్రారంభించనున్నాడు. దాంతో ‘భవదీయుడు భగత్‌సింగ్’ పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టనుంది. ఈ క్రమంలో పూజా డేట్స్ విషయంలో సందిగ్ధత నెలకొంది. దాంతో ఈ ప్రాజెక్ట్ నుంచి పూజాహెగ్డే తప్పుకుంటున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూజా బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, సల్మాన్‌ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళి’ చిత్రాలలో నటిస్తుంది. ఇక తెలుగులో మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌తో పాటు విజయ్ ‘జనగణమన’లోనూ నటించనుంది.
Pooja Hegde Photos
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

