బ్రూస్లీని ఆరాధిస్తూ
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెకించిన కొత్త చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమాలో పూజా భాలేకర్ నాయికగా నటిస్తున్నది. హిందీ, చైనీస్‌తో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపింది నటి పూజా భాలేకర్.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెకించిన కొత్త చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమాలో పూజా భాలేకర్ నాయికగా నటిస్తున్నది. హిందీ, చైనీస్‌తో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపింది నటి పూజా భాలేకర్. ఆమె మాట్లాడుతూ..‘ఈ సినిమాలో నా పాత్ర పేరు పూజా కానిక్. ఆమెకు బ్రూస్ లీ అంటే ఇష్టం. బ్రూస్లీ మీదున్న ప్రేమతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది.
ఆమెకు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలతో ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ అవసరమని తెలుసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలతో జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అవేంటి అనేది తెరపై చూడాలి. నా చిన్నతనంలో యోగా చేసేదాన్ని. ఆ తరువాత అథ్లెట్‌గా మారాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చేయడంలో మార్షల్ ఆర్ట్స్ తెలియడం ఉపయోగపడింది. నాకు నటించిన అనుభవం లేదు. కానీ ఆ పాత్ర ఎలా ఉండాలి.. ఎలా మాట్లాడాలి..అనేవి వర్మ నేర్పించారు’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Pooja Bhalekar
- rgv
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

