Pindam Trailer | తెలుగులో సరికొత్త హారర్.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ‘పిండం’ ట్రైలర్..!
Pindam Movie | చాలా రోజుల గ్యాప్ తరువాత ఒకరికి ఒకరు (Okariki Okaru) ఫేమ్ శ్రీరామ్ (Sriram) నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Pindam Movie | చాలా రోజుల గ్యాప్ తరువాత ఒకరికి ఒకరు (Okariki Okaru) ఫేమ్ శ్రీరామ్ (Sriram) నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక ఇంట్లోకి హీరో శ్రీరామ్ తన కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.
ఈ సినిమాను డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

