Phalana Abbayi Phalana ammayi | ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ట్రైలర్ రిలీజ్.. ఊహలు గుసగుసలాడే ఛాయలు కనిపిస్తున్నాయే..!
Phalana Abbayi Phalana ammayi Trailer | ఏడేళ్ల తర్వాత శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమా మార్చి 17న రిలీజ్ కానుంది.
Phalana Abbayi Phalana ammayi Trailer | టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి క్రేజ్ ఉంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకటి. గతంలో వీళ్ల కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానందా’ సినిమాలు కల్ట్ క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించకపోయినా.. ఇప్పటికీ టీవీల్లో వస్తున్నాయంటే కన్నార్పకుండా చూస్తుంటాం. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్ల కలయికలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే న్యూఏజ్ లవ్‌స్టోరీ తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా ప్రతీది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై మంచి బజ్ యే ఉంది. కాగా తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లోనే సినిమా స్టోరీని చెప్పేశారు. వివిధ వయసుల్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఏ విధంగా ఉండబోతుందో అని సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్‌తోనే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఈ కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. మరీ అవసరాల శ్రీనివాస్ ఈ కథను ఇంకా కొత్తగా ఎలా చూపిస్తాడో అనేది రిలీజయ్యాకే చూడాలి. ఊహలు గుసగుసలాడే స్టైల్లోనే ఇందులో కూడా అవసరాల కీలకపాత్ర పోషించినున్నట్లు తెలుస్తుంది. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.
రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీ.జి విశ్వప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక మార్చి 17న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

