Phalana Abbayi Phalana Ammayi Movie | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన నాగశౌర్య కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Phalana Abbayi Phalana Ammayi Movie On OTT | నాగశౌర్యకు గత కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు. ఎంతో కష్టపడి చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర కోట్లలో నష్టాలు తెచ్చిపెట్టాయి. ఐదేళ్ల క్రితం వచ్చిన ఛలో తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు సరైన హిట్టు లేదు.
Phalana Abbayi Phalana Ammayi Movie On OTT | నాగశౌర్యకు గత కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు. ఎంతో కష్టపడి చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర కోట్లలో నష్టాలు తెచ్చిపెట్టాయి. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు సరైన హిట్టు లేదు. మధ్యలో ‘అశ్వథ్థామ’ బాగానే ఆడినా.. కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. దాంతో తనకు రెండు మర్చిపోలేని హిట్లిచ్చిన శ్రీనివాస్ అవసరాలతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే రోమ్-కామ్ సినిమా చేశాడు. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కానీ తీరా రిలీజయ్యాక తొలిరోజు నుంచి నెగెటీవ్ టాక్ తెచ్చుకుని బడ్జెట్లో పావు వంతు కలెక్షన్లు కూడా రికవరీ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ ఎన్ఎక్స్టీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మాళవికా నాయర్ నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీ.జి విశ్వప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మార్చి 17న విడుదలైన ఈ సినిమా ఆరు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

