అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయిక. శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రధారులు. బుచ్చిబాబు సానా దర్శకుడు. వెంకటసతీశ్ కిలారు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. మరో 6రోజుల్లో గుమ్మడికాయ కొట్టేయనున్నట్టు మేకర్స్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్స్ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్ షూటింగ్ స్పాట్‌లోని పాజిటివ్ ఎనర్జీని సూచిస్తున్నాయి. ైస్టెలిష్ లుక్‌లో కనిపిస్తున్న రామ్‌చరణ్‌ని, ఆయనతో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానాను ఈ పోస్టర్లో చూడొచ్చు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏఆర్ రెహమాన్, సహనిర్మాత: ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.