Indian Idol: సీజన్-12 విజేత పవన్‌దీప్ రాజన్
Indian Idol | పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్-12’ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించే ఇండియన్ ఐడల్ సీజన్ 12 గతేడాది నవంబర్‌లో ప్రారంమైంది.

న్యూఢిల్లీ: పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్-12’ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించే ఇండియన్ ఐడల్ సీజన్ 12 గతేడాది నవంబర్‌లో ప్రారంమైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించారు. ఆరుగురు ఫైనలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ఈ సింగింగ్ రియాలిటీ షోలో ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్, సేలీ కంబ్లే, దానిష్ మహ్మద్, నిహల్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నది. విజేత పవన్‌దీప్‌కు ఇండియన్ ఐడల్ ట్రోఫీతోపాటు కారు, రూ.25 లక్షల నగదు అందజేశారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే అర్ధరాత్రి వరకు సాగింది. ఇందులో సేలీ కంబ్లే, అరుణిత కంజిలాల్, నిహాల్ తౌరో, పవన్‌దీప్ రాజన్, దానిష్ మహ్మద్, షణ్ముఖ ప్రియ తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే చివరికి అత్యుత్తమ ప్రదర్శన చేసిన పవన్‌దీప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఆదిత్య నారాయణ్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో హిమేశ్ రేష్మియా, అను మాలిక్, సోను కక్కర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

