Hari Hara Veeramallu | హరి హర వీరమల్లు సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. ఫోటో వైరల్..!
Hari Hara Veeramallu Movie | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'హరిహర వీరమల్లు' ఒకటి. కొన్ని నెలల క్రీతం వరకు ఈ సినిమాపై ప్రేక్షకులలో పెద్దగా అంచనాలు లేవు. కానీ పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ గ్లింప్స్ ఒక్కసారిగా భారీ అంచనాలను నెలకొల్పింది.
Hari Hara Veeramallu Movie | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. కొన్ని నెలల క్రీతం వరకు ఈ సినిమాపై ప్రేక్షకులలో పెద్దగా అంచనాలు లేవు. కానీ పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ గ్లింప్స్ ఒక్కసారిగా భారీ అంచనాలను నెలకొల్పింది. గ్లింప్స్ రిలీజైనప్పటి నుండి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓ భారీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో చిత్రబృందం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఎరుపు రంగు కాస్టూమ్ ధరించి మొహంపై చిరునవ్వు చిందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీష్ ఫక్రీ నటిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
PawanKalyan back on sets of #HariHaraVeeraMallu 🔥 pic.twitter.com/WcZaoYTYFS
— Pawanism Holics (@PawanismHolics) November 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

