Pawan Kalyan | హరిహర వీరమల్లు కంటే ముందే రానున్న వినోదయ సిత్తం రీమేక్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రానున్న ఎలక్షన్ల దృష్ట్యా ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం పవన్ 'హరిహర వీరమల్లు' షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
Pawan Kalyan Next Release | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రానున్న ఎలక్షన్ల దృష్ట్యా ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటుగా వినోదయ సిత్తం రీమేక్‌ను కూడా ప్రారంభించే పనిలో ఉన్నాడు. పి. సముద్రఖని దర్వకత్వం వహించనున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టంట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను హరిహర వీరమల్లు కంటే ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లును ముందుగా ఏప్రిల్‌లో అనుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో దసరాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో వినోదయ సిత్తం రీమేక్‌ను పూర్తి చేసి సమ్మర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి చివరివారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు. ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదిస్తే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కథ. యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించనున్నాడు. పేరుకు తమిళ రీమేక్ అయినా.. త్రివిక్రమ్ తెలుగు నెటీవిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

