Pawan Kalyan | సింగపూర్‌లో అగ్నిప్రమాదం.. పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అతని చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముంగళవారం సింగపూర్ వెళ్లనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం కురిడిలో ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమవుతారు.
కాగా, మరో మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలోనే ఉండనున్నట్లు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ప్రకటించారు. బుధవారం సాయంత్రం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. అయితే కుమారుడికి ప్రమాదం జరగడంతో ఆయన అల్లూరి జిల్లా పర్యటన అనంతరం సింగపూర్ బయలుదేరనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

