‘దేవర’గా పవన్‌కల్యాణ్?
తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సీతమ్' తెలుగు రీమేక్‌లో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సీతమ్’ తెలుగు రీమేక్‌లో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్ 20రోజుల పాటు డేట్స్ కేటాయించారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలిసింది. జూలై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఓ సామాన్య యువకుడికి, దేవుడికి మధ్య జరిగే సంవాదం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్), హరీష్‌శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాల్లో నటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

