Pawan Kalyan | చివరి నిమిషంలో పవన్ సినిమా వాయిదా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, వినోధయ సీతమ్ రీమేక్స్ ఉన్నాయి. సముద్రఖని డైరెక్షన్లో చేయబోతున్న వినోధయ సీతమ్ (Vinodaya Sitham) రీమేక్ ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 22న సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, వినోధయ సీతమ్ రీమేక్స్ ఉన్నాయి. వీటిలో క్రిష్ ప్రాజెక్టు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లింది. కాగా సముద్రఖని డైరెక్షన్లో చేయబోతున్న వినోధయ సీతమ్ (Vinodaya Sitham) రీమేక్‌కు పవన్ 20 రోజులు డేట్స్ కూడా సర్దుబాటు చేశాడని ఇన్సైడ్ టాక్. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 22న సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
కానీ పవన్ కల్యాణ్ అస్వస్థతకు లోను కావడంతో ఈ చిత్రం షూటింగ్ చివరి నిమిషంలో వాయిదా పడినట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయితే టాలీవుడ్ (Tollywood) యువ హీరో సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సాధారణంగా పవన్ సినిమాలకు రైటర్‌గా వ్యవహరించే త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా సంభాషణలు సమకూరుస్తున్నారని వార్తలు తెరపైకి వస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. విలన్‌గా, డైరెక్టర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సముద్రఖని పవన్ ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నాడని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

