బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh) , సుజిత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఓజీ (OG) షూటింగ్ దశలో ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ.. రెండు సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు పవన్ కల్యాణ్. కాగా ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపే క్రేజీ అప్డేట్ అందించారు మైత్రీ మూవీ మేకర్స్.
బ్లాక్ బస్టర్ పవర్ఫుల్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ ఫుల్ గ్లింప్స్ వీడియోను మే 11న లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. దీంతోపాటు మరోవైపు ఓజీ షూటింగ్కు సంబంధించిన అప్డేట్ కూడా నెట్టింట ఫొటోల రూపంలో చక్కర్లు కొడుతోంది. ఓజీ షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ పోర్షన్కు సంబంధించి మొత్తం సన్నివేశాల చిత్రీకరణ 45 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసింది సుజిత్ టీం. పవన్ కల్యాణ్ అండ్ సుజిత్ టీం ఇప్పటికే 10 రోజుల ముంబై షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది.
మొత్తానికి ఓ వైపు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వీడియో రెడీ అవుతుండటం.. మరోవైపు ఓజీ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తవుతుందన్న వార్తలు తెరపైకి రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి గబ్బర్ సింగ్ను మించిన ఆల్బమ్ రెడీ అవుతోందని ఇప్పటికే హరీష్ శంకర్ అప్డేట్ కూడా ఇచ్చేశాడు. మొత్తానికి భీమ్లానాయక్ తర్వాత షూటింగ్స్ విషయంలో కొంత బ్రేక్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ కు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నట్టు అర్థమవుతోంది.
The Blockbuster Combination is a Back💥💥
Powerful Glimpse on #May11th 😎 Stay tuned for More Updates….@PawanKalyan // @ThisIsDSP #UstaadBhagatSingh pic.twitter.com/jQIyPy1xpG
— Mythri Movie Makers (@vamsi_thota_) May 1, 2023
Balagam | భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు ఫిదా.. బలగం ఖాతాలో మరో పురస్కారం
Gaami | విశ్వక్ సేన్ గామి అప్డేట్ ఇచ్చిన చాందినీ చౌదరి