Pawan Kalyan | ‘ నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు’ .. ఆ పేరు ఎలా వచ్చిందంటే.. : పవన్ కళ్యాణ్
Pawan Kalyan | తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక నటన, మేనరిజమ్స్, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ‘పవర్ స్టార్’గా ఎదిగారు.
Pawan Kalyan | తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక నటన, మేనరిజమ్స్, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ‘పవర్ స్టార్’గా ఎదిగారు. నటుడిగా మాత్రమే కాకుండా కథా రచయితగా, గాయకుడిగా, స్టంట్ డిజైనర్‌గా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన పేరు వెనుక ఉన్న అసలు కథను వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదని తెలిపారు. నాకు నామకరణం చేసినప్పుడు పెట్టిన పేరు ‘శ్రీ కళ్యాణ్ కుమార్’. అయితే స్కూల్ రికార్డుల్లో ‘శ్రీ’ అనే పదం తొలగిపోయి ‘కె. కళ్యాణ్ కుమార్’గా నమోదైంది. ఆ తర్వాత నా జీవితంలోకి ‘పవన్’ అనే పదం వచ్చింది” అని ఆయన చెప్పారు. తనకు మార్షల్ ఆర్ట్స్‌పై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేదని, శిక్షణ పొందే రోజుల్లో శారీరక శక్తిని ప్రదర్శించే కఠినమైన సాధనలు చేసేవాడినని పవన్ గుర్తు చేసుకున్నారు. నా ఛాతిపై వందల కిలోల బరువున్న రాళ్లను పెట్టి పగలగొట్టించే ప్రదర్శనలు చేసేవాడిని. నా శక్తి, పట్టుదల చూసిన మా మార్షల్ ఆర్ట్స్ గురువు హనుమంతుడిని గుర్తుచేస్తూ నా పేరుకు ముందు ‘పవన్’ అనే పదాన్ని జోడించారు. పవనపుత్రుడైన హనుమంతుడి నుంచి స్ఫూర్తి పొందిన ఆ పేరు తర్వాత నా జీవితంలో భాగమైంది అని వివరించారు.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత ‘పవన్ కళ్యాణ్’ అనే పేరు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందింది. వరుస విజయాలతో ఆయన స్టార్ హీరోగా ఎదగడంతో అభిమానులు ప్రేమగా ‘పవర్ స్టార్’ అనే బిరుదును అందించారు. ఆ తర్వాత ఆ పేరు కేవలం ఒక స్క్రీన్ నేమ్‌గా కాకుండా, తెలుగు సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమ కుమారుడికి మొదట ‘కళ్యాణ్ కుమార్’ అని పేరు పెట్టామని, తర్వాత అతనే ‘పవన్ కళ్యాణ్’గా మార్చుకున్నాడని వెల్లడించారు.అయితే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ పేరు వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించడంతో అభిమానులకు పూర్తి క్లారిటీ వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

