Pawan Kalyan | పులుల్ని వేటాడే బెబ్బులి… ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేసింది
Hari Hara Veera Mallu Trailer | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
Hari Hara Veera Mallu Trailer | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1-స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. జూలై 24, 2025న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం పకృతి పురుడు పోసుకుంటున్న సమయం. అన్న డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ చూస్తుంటే.. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించారు. ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

