Hari Hara Veera Mallu | ఓ వైపు ఏపీలో ఎన్నికల పోరుకు సిద్దమవుతూనే.. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని రోజులుగా కొత్త అప్డేట్ ఏమీ రాలేదు. చాలా రోజులకు ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
హరిహరవీరమల్లు స్పెషల్ ప్రోమో రాబోతుందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందని నెట్టింట అప్డేట్ హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే. ఇప్పటికే ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్న బాబీ డియోల్ ఓ ఈవెంట్లో హరిహరవీరమల్లు డైలాగ్ లీక్ చేశాడని తెలిసిందే. ‘బాద్ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్ చెప్పి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
పవన్ కల్యాణ్ కెరీర్లోనే తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
క్రిష్ టీం ఇప్పటికే షేర్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. హరిహరవీరమల్లు అండ్ టీంపై వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీన్లను ఇప్పటికే రామోజీఫిలింసిటీలో చిత్రీకరించారు. పవన్ కల్యాణ్ మరోవైపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
హర్ష్ వర్మ ఏమన్నాడంటే..?
‘ @PawanKalyan sir is busy with his political party called JanaSena, which is big down south 👌#HariHaraVeeraMallu climax has to be shoot once he is free: @verma_h
PK recommend him and now he will act in HHVM 😍 pic.twitter.com/vBCMm6Yq2Q
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) September 10, 2023
Actress @AgerwalNidhhi about #PawanKalyan and @HHVMFilm 🔥#HariHaraVeeraMallu @PawanKalyanpic.twitter.com/wNDJ3H6ZeZ
— PawanKalyan FC™ (@Legend_PSPK) September 6, 2023
#HariHaraVeeraMallu will release in Two Parts 🔥🔥🔥🔥
Great news for #TeamHHVM 😎 pic.twitter.com/xg92chmLl1
— SHIVAJI SENANI (@ShivajiSurada) September 13, 2023
#HariHaraVeeraMallu to be completed by this year end and we are planning to Release it before Elections- AM Rathnam💥
pic.twitter.com/8s8VuqoP76— Rusthum (@RusthumlHere) September 4, 2023
ఓజీ గ్లింప్స్..
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..