Pawan Remuneration | పవన్ కల్యాణ్ పారితోషికం ప్రయాణం అదిరిందంతే..!
సినీ పరిశ్రమలో ఇపుడు వేలల్లో పారితోషికం (Remuneration) తీసుకునే నటీనటుల్లో చాలా మంది ఒకప్పుడు వందల్లోనే తమ కెరీర్ ను మొదలుపెట్టారు. అలాంటి వారి జాబితాలోకే వస్తాడు టాలీవుడ్ (TOLLYWOOD) హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).

సినీ పరిశ్రమలో ఇపుడు వేలల్లో పారితోషికం (Remuneration) తీసుకునే నటీనటుల్లో చాలా మంది ఒకప్పుడు వందల్లోనే తమ కెరీర్ ను మొదలుపెట్టారు. ఇపుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నవాళ్లు కెరీర్ తొలినాళ్లలో అతి తక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ గా అందుకున్నారు. అలాంటి వారి జాబితాలోకే వస్తాడు టాలీవుడ్ (TOLLYWOOD) హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాతో తొలిసారి హీరోగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు పవన్ కల్యాణ్.
గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ మూవీ తెరకెక్కించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ చెప్పిన ప్రకారం..1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేస్తున్న సమయంలో అతడు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా..? నెలకు రూ. 5వేలు.షూటింగ్ పూర్తయ్యే వరకు కొన్ని నెలల పాటు ఇలా పారితోషికం అందుకున్నాడట పవన్. ఆ తర్వాత భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో చేసిన సుస్వాగతం పవన్ కల్యాణ్ కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కట్ చేస్తే ఇపుడు ఒక్క సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ.50 కోట్లు.
ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతోపాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లానాయక్ సినిమాలు చేస్తున్నాడు. రాబోయే కాలంలో పవన్ అందుకుంటున్న రూ.50 కోట్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు.
మొత్తానికి పవన్ రెమ్యునరేషన్ జర్నీ రూ.5 వేల నుంచి రూ.50 కోట్లకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి. 2017లో నటించిన అజ్ఞాతవాసి బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడం, అనంతరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో నిరాశలో మునిగిపోయారు అభిమానులు. ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రికార్డులు సృష్టించి..ఇపుడు వరుస సినిమాలతో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

