Pawan Kalyan | అభిమానులకు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌లో షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహరవీరమల్లు సెట్స్ పై ఉంది. దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా లాంఛ్ చేశాడు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌లో షూటింగ్ దశలో ఉంది. సాయిధరమ్ తేజ్ మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహరవీరమల్లు సెట్స్ పై ఉంది. దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా లాంఛ్ చేశాడు.
ఇటీవలే ఈ మూవీ సెట్స్‌కు సంబంధించిన స్టిల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటితోపాటు సుజిత్ దర్శకత్వంలో OG చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాల షెడ్యూల్‌కు ఇబ్బంది కలగకుండా మరోవైపు పొలిటికల్ ప్లాన్ కూడా సెట్ చేసుకున్నాడు పవన్ కల్యాణ్. ఇదిలా ఉంటే ఈ క్రేజీ స్టార్ హీరోకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. అది కూడా ఎవరూ ఊహించని డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ సినిమా చేయబోతున్నాడంటే ఎలా ఉంటుంది.? ఇప్పుడలాంటి వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
స్వామి రారా సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న సుధీర్ వర్మ (Sudheer Varma)తో పవన్ కల్యాణ్ నెక్ట్స్ సినిమా ఉండబోతుందన్న అప్డేట్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. త్రివిక్రమ్ (Trivikram Srinivas) తనకొక ఐడియాను చెప్పారని, ఆ బేసిక్ పాయింట్ ఆధారంగా పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో సినిమా చేస్తే బాగుంటుందన్నారని సుధీర్ వర్మ చేసిన కామెంట్స్ ఈ ఆసక్తికర అప్డేట్ను తెరపైకి తెచ్చాయి.

త్రివిక్రమ్ చెప్పిన బేసిక్ పాయింట్ పవన్ కల్యాణ్‌కు కూడా నచ్చిందనడంతో దాదాపు ఈ మూవీకి గ్నీన్ సిగ్నల్ పడినట్టేనని సంకేతాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ విషయమై కొన్ని రోజులు ఆగాలని సుధీర్ వర్మకు సూచించాడట త్రివిక్రమ్. మొత్తానికి ఎవరి మాటెలా ఉన్నా అభిమానులు మాత్రం సుధీర్ వర్మ-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌ను మాత్రం ఊహించి ఉండరని చెప్పాల్సిందే.
ప్రస్తుతం రవితేజతో కలిసి రావణాసుర చిత్రం చేస్తున్నాడు సుధీర్ వర్మ. రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరి రాబోయే రోజుల్లో పవన్-సుధీర్ వర్మ సినిమా అప్డేట్ రావడం పక్కా అని అర్థమవుతున్నా.. ఈ క్రేజీ కాంబోకు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

