Pawan- Bunny | ఇన్నాళ్లకి మళ్లీ కలిసిన బన్నీ, పవన్ కళ్యాణ్.. సతీసమేతంగా ఇంటికి వెళ్లి మార్క్ ఆరోగ్యంపై ఆరా
Pawan- Bunny | కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చనీయాంశాలలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల వార్ ఒకటి. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ నంద్యాల వెళ్లి మరీ ప్రచారం చేశారు.
Pawan- Bunny | కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చనీయాంశాలలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల వార్ ఒకటి. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ నంద్యాల వెళ్లి మరీ ప్రచారం చేశారు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్ వైపు అంటే ..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ని ఓ రేంజ్లో ఆడేసుకున్నారు.
ఆ తర్వాత నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేయడం, మెగా హీరోలు కూడా బన్నీ విషయాలలో పెద్దగా స్పందించకపోవడంతో అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడనే ప్రచారం అయితే జోరుగా నడిచింది. .పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ , మెగా హీరోలెవ్వరూ స్పందించకపోవడం, అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ హీరోలు ఏ మాత్రం స్పందించకపోవడం, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం వంటివి రెండు ఫ్యామిలీల మధ్య పెరిగిన దూరానికి సంకేతాలుగా చెప్పుకొచ్చారు.
అయితే నిన్న సాయంత్రం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతన్ని కుమారుడిని పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే బన్నీ ఆయన భార్య స్నేహ రెడ్డి పవన్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు మాట్లాడినట్లు సమాచారం. ఇన్నాళ్లు బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ జరిగిన గొడవ ఈ కలుయికతో కొలిక్కి వస్తుందా లేదా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

