Pathaan | ఓపెనింగ్ వీకెండ్లో రూ.400 కోట్లు.. పఠాన్ టార్గెట్ చేరుకుంటాడా..?
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇటీవలే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్ దాటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఈ స్టార్ యాక్టర్ ఇటీవలే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పఠాన్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా జనవరి 25న విడుదలైంది.
ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్ దాటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. కాగా ఇపుడు పఠాన్ మార్క్ కలెక్షన్లపై ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. షారుఖ్ ఖాన్ క్రేజ్‌తో పఠాన్ ఫస్ట్ వీకెండ్లో రూ.400 కోట్ల గ్రాస్ దాటేస్తుందా..? అన్న ప్రశ్న ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
500 కోట్ల క్లబ్‌లోకి..?
అయితే ఫస్ట్ సన్డే పఠాన్ ఎంత వసూళ్లు చేస్తుందనే అప్డేట్ తెలిస్తే.. అందరూ అనుకుంటున్న టార్గెట్ చేరుకునే విషయంపై క్లారిటీ వస్తుంది. అంతేకాదు పఠాన్ ఫస్ట్ వీకెండ్లో 500 కోట్ల క్లబ్‌లోకి కూడా ప్రవేశించి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడా..? అంటూ మరో చర్చ కూడా నడుస్తోంది. నాలుగు రోజుల్లోపే రూ.200 కోట్ల మార్క్‌ను సులభంగా దాటేసిన పఠాన్‌కు టార్గెట్ చేరుకోవడం పెద్ద విషయమేమి కాదని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు.
పఠాన్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు మూవీ లవర్స్. పఠాన్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జాన్ అబ్రహాం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు. టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో పఠాన్ చిత్రాన్ని తెరకెక్కించింది.
పఠాన్ కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్..
‘PATHAAN’: ₹ 219.60 CR WORLDWIDE *GROSS* IN 2 DAYS… #Pathaan #India + #Overseas *Gross* BOC…
⭐️ Day 1: ₹ 106 cr
⭐️ Day 2: ₹ 113.60 cr
⭐️ Worldwide *GROSS* Total: ₹ 219.60 cr
🔥🔥🔥 pic.twitter.com/MFnr6gMK9z— taran adarsh (@taran_adarsh) January 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

