Pathaan Movie | బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసిన పఠాన్.. తొలి ఇండియన్ సినిమాగా అరుదైన ఘనత
పఠాన్ హవా ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బోలెడన్ని రికార్డులను చెరిపేసిన పఠాన్ తాజాగా బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసింది.
Pathaan Movie Breaks Bahubali-2 Record | కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వంటి సినిమాలు బాలీవుడ్‌కు నేనున్నా అంటూ పలకరించినా.. ఎక్కడో సౌత్ సినిమాల డామినేషన్ కనిపించింది. సౌత్ సినిమాల కలెక్షన్లు ముందు అవి నథింగ్లా అనిపించాయి. పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బైకాట్ అంశం ఎక్కువైపోయింది. దాంతో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే దర్శక, నిర్మాతల్లో ఎక్కడ లేని గుబులు. ఈ క్రమంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ పఠాన్ జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
రిలీజ్ ముందు నుంచి ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్ ఏర్పడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు వంద కోట్ల గ్రాస్‌కు దిగకుండా కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. షారుఖ్‌ఖాన్ యాక్షన్, దీపికా అందాలు, జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఇన్నాళ్లు బాహుబలి-2 పేరిట ఉన్న ఈ రికార్డును పఠాన్ బ్రేక్ చేసింది. పోటీగా షెహజాదా, సెల్ఫీ వంటి సినిమాలున్నా పఠాన్ భారీ కలెక్షన్లతో దూసుకపోతుందంటే విశేషం అనే చెప్పాలి.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్కును అందుకున్న ఈ సినిమా ఫైనల్ రన్లో మరో వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

