Pathaan Movie | షారుఖ్‌ఖాన్ వీర విహారం.. వెయ్యి కోట్ల దిశగా పఠాన్ మూవీ..!
షారుఖ్‌ఖాన్‌ను బాలీవుడ్ బాద్షా అని ఎందుకుంటారో ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. ఆయన సినిమా చేసి నాలుగేళ్లయింది. హిట్టు చూసి పదేళ్లయింది. అయినా కానీ 'పఠాన్'తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.
Pathaan Movie Collections | షారుఖ్‌ఖాన్‌ను బాలీవుడ్ బాద్షా అని ఎందుకుంటారో ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. ఆయన సినిమా చేసి నాలుగేళ్లయింది. హిట్టు చూసి పదేళ్లయింది. అయినా కానీ ‘పఠాన్’తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. విడుదలకు ముందు జరిగిన హడావిడితో రిలీజ్ రోజున వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టాడు. బాగా హైప్‌తో రిలీజైన సినిమా కాబట్టి ముందు రోజు ఆ మాత్రం వస్తాయిలే అని అందరు అనుకున్నారు. పైగా దానికి తోడు డివైడ్ టాక్. ఇక పఠాన్ ముచ్చట ఒకరోజే అని ఫిక్సయ్యారు. కానీ షారుఖ్ అందరి అంచనాలను తిరగేస్తూ తోలిరోజుకు మించి రెండో రోజు కలెక్షన్లు సాధించి ఔరా అనిపించాడు.
ఇక మూడో రోజు కూడా వరుసగా వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి వేగంగా మూడొందల కోట్ల మార్కును టచ్ చేసిన తొలి బాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు. గతేడాది నుండి బాలీవుడ్ సినిమాలకు వంద కోట్ల బొమ్మే గగనంలా అయింది. అలాంటిది పఠాన్ మూడు రోజుల్లోనే ముడొందల కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. ఇక నాలుగు, ఐదు ఇలా వరుసగా ప్రతీ రోజు వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్‌పై విరుచుకుపడుతున్నాడు. ఇక తొలివారం పూర్తయ్యే సరికి రూ.650 కోట్లు కలెక్ట్ చేసి కనివిని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.
ఇక్కడే అనుకంటే ఓవర్సీస్లోనే పఠాన్ వీర విహారం చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి-2’ ఫుల్రన్లను జపాన్, చైనా రిలీజు లేకుండానే అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే మరో వారంలో పఠాన్ వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. పైగా నార్త్‌లో అన్ని సెంటర్లలో ఇది తప్ప వేరు ఆప్షన్ కూడా లేదు. ఈ సినిమా సునామిలో ‘గాంధీ గాడ్సే’ సినిమా కొట్టుకుపోయింది. ఇక తాజాగా పఠాన్ రూ.300 కోట్ల షేర్ని అత్యంత వేగంగా సాధించి బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. ఆ ఫీట్‌ను సాధించడానికి బాహుబలి-2కు పది రోజులు పట్టింది. కానీ పఠాన్ కేవలం వారంరోజుల్లోనే ఆ ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా రికార్డులతో షారుఖ్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

