Paruvu Web Series | పరువు పరుగు..
ప్రతివారం ఎన్నో సినిమాలు, సిరీస్‌లు.. ఓటీటీల్లో విడుదల అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. లవ్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్లతో పోలిస్తే క్రైమ్, థ్రిల్లింగ్ కథలతో తెరకెక్కేవే.. ప్రస్తుతం హిట్‌టాక్ సొంతం చేసుకుంటున్నాయి.
వెబ్ సిరీస్ : పరువు
నటీనటులు : నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య,నాగబాబు, బిందు మాధవి
దర్శకత్వం : సిద్ధార్థ్ నాయుడు
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు : కొణిదల సుస్మిత, లగ్గిశెట్టి విష్ణు ప్రసాద్
ఓటీటీ : జీ5
ప్రతివారం ఎన్నో సినిమాలు, సిరీస్‌లు.. ఓటీటీల్లో విడుదల అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. లవ్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్లతో పోలిస్తే క్రైమ్, థ్రిల్లింగ్ కథలతో తెరకెక్కేవే.. ప్రస్తుతం హిట్‌టాక్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పరువు హత్యల నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కిందే ఈ ‘పరువు’ వెబ్ సిరీస్. పోయిన వారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చి.. టాప్ 10లో నిలిచింది.
కథ : పెద్దలను ఎదిరించి సుధీర్ (నరేష్ అగస్త్య)ను పెళ్లి చేసుకుంటుంది పల్లవి (నివేదా పేతురాజ్). వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నదనే కారణంతో పల్లవిని తల్లిదండ్రులు, బంధువులు కూడా దూరంగా ఉంచుతారు. అయితే, పెద్దనాన్న మరణించారనే వార్త తెలిసిన పల్లవి.. భర్తతో కలిసి సొంతూరికి బయల్దేరుతుంది. కొన్ని కారణాలతో.. ఇష్టం లేకున్నా వారిని తన కారులో తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు పల్లవి బావ చందు (సునీల్ కొమ్మిశెట్టి). ప్రయాణ సమయంలో తన భర్తను చులకన చేస్తూ మాట్లాడిన చందుతో గొడవపడుతుంది పల్లవి.
ఈ క్రమంలో చందు దగ్గర తుపాకీ ఉన్నట్టు తెలుస్తుంది. తన భర్తను చంపేందుకే తుపాకీ తెచ్చాడని అనుమానిస్తుంది పల్లవి. అదేం కాదని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు చందు. అయినప్పటికీ.. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోతుంది. ఈ క్రమంలో సుధీర్ రాడ్డుతో కొట్టడంతో చందు చనిపోతాడు. శవాన్ని ఎవరికీ కనిపించకుండా చేయాలని నిర్ణయించుకుంటారు భార్యాభర్తలిద్దరూ.
ఇక, చందు కనిపించడం లేదని అప్పటికే తనతో నిశ్చితార్థం అయిన స్వాతి (ప్రణీత పట్నాయక్) ఎంక్వయిరీ చేస్తుంది. ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) చందూను కిడ్నాప్ చేయించి ఉంటాడని ఆరోపిస్తుంది. అసలు రామయ్యకు చందూకి ఉన్న సంబంధం ఏంటి? చందు శవాన్ని పల్లవి, సుధీర్ ఏం చేశారు? చందు దగ్గర తుపాకీ ఎందుకు ఉంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉంది : పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ అని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే, చందు శవాన్ని ఏం చేశారు? అనే దానిపై కథను నడిపించాడు దర్శకుడు. గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న సన్నివేశాలను ఎక్కువగా అటూఇటూ చూపించడంతో సగటు ప్రేక్షకుడిలో కాస్త తికమక ఏర్పడుతుంది. అదే సమయంలో కొన్ని ఎపిసోడ్స్ వేగంగా సాగుతాయి. దీంతో సిరీస్ చూస్తున్నంత సేపూ బోర్ కొట్టదు. క్లయిమాక్స్ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. చాలా వెబ్ సిరీస్‌లలో ఉండే అభ్యంతరకర సన్నివేశాలు.. ఈ సిరీస్‌లో మచ్చుకు కూడా కనిపించవు. అయితే, సంభాషణల్లో మాత్రం ప్రతి క్యారెక్టర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

