Parineeti Chopra | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఓ ఇంటిదై ఆరు మాసాలు అవుతున్నది. ఈ సందర్భంగా తన భర్త రాఘవ్ చద్ధాతో కలిసి హాఫ్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ‘ఈ ఆరునెలల కాలం క్షణంలా గడిచిపోయింది. అందమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నా! సోషల్ మీడియా చూడటం దాదాపు మానేశాను. ఇప్పుడు నా జీవితంలో సామాజిక మాధ్యమాల పాత్ర కేవలం ఒకే ఒక్క శాతం! నా ఫాలోవర్స్ కూడా మా దంపతుల విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తుండటం సంతోషంగా ఉంది.
ఈ ఆరు నెలల్లో మామధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. మా ఇద్దరివీ విభిన్న రంగాలు కావడంతో అనవసరమైన చర్చలకు అవకాశమే ఉండదు. మా ఆయనకు సినిమాల గురించి అంతగా పట్టదు. నాకు రాజకీయాలపై అవగాహన లేదు. కానీ, ప్రజా సమస్యలను మాత్రం అర్థం చేసుకుంటా!’ అని చెప్పుకొచ్చింది పరిణీతి.