గ్రామ రాజకీయాలు
పంచాయత్.. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం అభిమానులు రెండేండ్లుగా ఎదురుచూశారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో మే 28 నుంచి పంచాయత్ 3 స్ట్రీమింగ్కు వచ్చింది. పులేరా అనే గ్రామంలో జరిగే పరిణామాలతో పంచాయత్ సిరీస్ తెరకెక్కుతున్నది.
పంచాయత్ సీజన్ 3
అమెజాన్ ప్రైమ్: మే 28
తారాగణం: జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్ తదితరులు
దర్శకత్వం: దీపక్ కుమార్ మిశ్రా
పంచాయత్.. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం అభిమానులు రెండేండ్లుగా ఎదురుచూశారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో మే 28 నుంచి పంచాయత్ 3 స్ట్రీమింగ్కు వచ్చింది. పులేరా అనే గ్రామంలో జరిగే పరిణామాలతో పంచాయత్ సిరీస్ తెరకెక్కుతున్నది. కాగా, ప్రహ్లాద్ (ఫైజల్ మాలిక్) కొడుకు మరణించడం, పులేరా నుంచి పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) ట్రాన్స్ఫర్ కావడంతో రెండో సీజన్ ముగిసిన విషయం తెలిసిందే.
కథ: పులేరాకు కొత్త సెక్రటరీ రావడంతో మూడో సీజన్ మొదలవుతుంది. సర్పంచ్ మంజుదేవి (నీనా గుప్త), భర్త బ్రిజ్ భూషణ్ దూబే (రఘువీర్ యాదవ్), ప్రహ్లాద్ సహా గ్రామస్తులు కొత్త సెక్రటరీని అడ్డుకుంటారు. అభిషేక్ త్రిపాఠిని మరోసారి సెక్రటరీగా తెచ్చుకుంటారు. దీంతో ఎమ్మెల్యే చంద్రకిశోర్ సింగ్ (ప్రకాశ్ ఝా)తో దూబే సహా పులేరా గ్రామస్తులకు ఉన్న విభేదాలు పెరుగుతాయి. ఓ వృద్ధురాలికి ప్రధానమంత్రి గరీబ్ ఆవాస్ యోజన కింద ఇంటిని అభిషేక్ మంజూరు చేయటంతో పులేరాలో రాజకీయాలు మొదలవుతాయి. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎమ్మెల్యేతో పులేరాలో ఉండే భూషణ్ (దుర్గేశ్ కుమార్) చేతులు కలిపి మంజూదేవి, బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఆ తర్వాత పులేరాలో రాజకీయాలు ఎలా సాగాయి అనేది మూడో సీజన్ కథ.
పంచాయత్ సీజన్ 3 అక్కడక్కడా స్లోగా అనిపించినా ఆకట్టుకుంటుంది. రెండు సీజన్లతో పోలిస్తే కామెడీ, ఎంటర్టైన్మెంట్ కాస్తంత తగ్గినా ఎమోషన్లు మెప్పిస్తాయి. పాలిటిక్స్ ఆసక్తికరంగా సాగుతాయి. ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో లేదు. హిందీ ఆడియోతో ఉన్న పంచాయత్ 3 సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

