Pakka Commercial | ‘పక్కా కమర్షియల్’ ప్రెస్‌మీట్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Pakka Commercial | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు గోపిచంద్. గత కొంత కాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టింది. ప్రస్తుతం ఈయన నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లను ప్రారంభించింది. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
శుక్రవారం సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో మేకర్స్ వెల్లడించారు. విడుదలకు ఇంకా నెల రోజుల కంటే తక్కువగా ఉండటంతో చిత్ర బృందం ప్రేక్షకులలోకి సినిమాను తీసుకువెళ్ళాలని స్పీడ్‌గా ప్రమోషన్లను జరుపుతున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘అందాల రాశి’ పాటకు శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు. గోపిచంద్ ఈ చిత్రం తర్వాత శ్రీవాస్‌తో హ్యట్రిక్ సినిమా చేయనున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు గోపిచంద్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
Macho star @YoursGopichand & @DirectorMaruthi's #PakkaCommercial Press Meet to be held today at Hyderabad! 💥#AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations @adityamusic @shreyasgroup #PakkaCommercialOnJuly1st 🔥 pic.twitter.com/393S76tAle
— GA2 Pictures (@GA2Official) June 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

