Besharam Rang Controversy | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటుడు నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలోని తొలిపాట ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలవగా.. వివాదాలు చుట్టుముట్టాయి. పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే ధరించిన కాషాయరంగు బికినీపై హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. ఆ తర్వాత పాట సైతం కాపీ చేసినట్లు విమర్శలు వచ్చాయి. తాజాగా పాక్‌కు చెందిన సింగర్ సైతం సంచలన ఆరోపణలు చేశాడు. ‘బేషరమ్ రంగ్’ ట్యూన్‌ను కాపీ చేసినట్లు చెప్పకపోయినా ఈ పాటను విన్నప్పుడు గతంలోని ఒక పాట గుర్తుకు వచ్చిందంటూ కామెంట్ చేశాడు పాక్ గాయకుడు సజ్జాద్ అలీ.
బేషరమ్ రంగ్ పాటకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సజ్జాద్ పాటను కాపీ చేసినట్లు నేరుగా చెప్పకపోయినా.. గతంలో పాడిన పాట ‘అబ్ కే హమ్ బిచ్డే’ గుర్తుకు వచ్చిందన్నారు. బేషరమ్ రంగ్ పాటను వినిగానే దాదాపు 25-26 సంవత్సరాల పాట యాద్ ఆ గయా అంటూ పేర్కొన్నాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం పఠాన్. చిత్రంలో షారుఖ్‌కు దీపికా జోడీగా నటిస్తున్నది. ఈ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. బ్యాన్ చేయాలని హిందూ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.