OTT | రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుండగా, ఈ వారం సినీ ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఓటీటీ రిలీజ్‌లపై పడింది. థియేటర్లలో పెద్ద సినిమాల సందడి తక్కువగా ఉండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, బోల్డ్ కంటెంట్ ఇలా అన్ని రకాల జానర్లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది.
ఇక థియేటర్ల విషయానికి వస్తే, 94 ఏళ్ల వయసులో కూడా సృజనాత్మకతను కొనసాగిస్తున్న ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన కోర్ట్ రూం డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి రానుంది.
షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మార్టిన్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. అలానే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భూత్ బంగ్లా’ హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. భయం, వినోదం కలగలిపిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే అవకాశం ఉంది.
తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన బోల్డ్ అంథాలజీ సిరీస్ ‘ష్…’ ఇప్పుడు మూడో సీజన్‌తో తిరిగి వస్తోంది. గత రెండు సీజన్ల కంటే మరింత సాహసోపేతమైన కథలు, కొత్త పాత్రలతో రూపొందిన ‘ష్ 3’ జూన్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ‘మిర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘రాఖ్’ కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. పాతాళ్ లోక్ సిరీస్ దర్శకుడు ప్రొసిత్ రాయ్ రూపొందించిన ఈ సిరీస్‌లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (రొమాంటిక్ డ్రామా) – జూన్ 10
షెల్టర్ (సర్వైవల్ థ్రిల్లర్) – జూన్ 12
స్వీట్ మంగోలియాస్ సీజన్ 5 – జూన్ 11
ఐ యామ్ ఫ్రాంకెల్డా (యానిమేటెడ్ ఫీచర్) – జూన్ 16
మా హైనా (కామెడీ సిరీస్) – జూన్ 12
థార్కటా – జూన్ 12
మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంది. థ్రిల్లర్లు, హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలు, బోల్డ్ సిరీస్‌లు ఇలా విభిన్న రకాల కంటెంట్ అందుబాటులోకి రానుండటంతో సినిమా అభిమానులకు ఇది మంచి ఎంటర్టైన్మెంట్ వీక్‌గా మారనుంది.