OTT | చూస్తుండగానే మార్చి నెల చివరి వారం మొదలైపోయింది. ఈ నెలలో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ వారం చిన్న సినిమాల వంతు వచ్చింది. కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో పలువురు యంగ్ హీరోలు, కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నారు. ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల్లో ‘బ్యాండ్ మేళం’ ముందంజలో ఉంది. ‘కోర్ట్’ మూవీతో గుర్తింపు పొందిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం బావ-మరదళ్ల ప్రేమ కథగా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే యంగ్ హీరో ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘సుయోధన’ మార్చి 27న విడుదలకు సిద్ధమైంది. హీరోకి మాత్రమే కనిపించే ప్రత్యేక శక్తి చుట్టూ తిరిగే ఈ కథ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్లకు ఇష్టపడే ప్రేక్షకుల కోసం సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన ‘G.O.A.T’ (గోట్) కూడా మార్చి 26న రిలీజ్ కానుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో సరదా కథగా ఈ సినిమా రూపొందింది.మరోవైపు తమిళంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘యూత్’ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో మార్చి 26న విడుదల కానుంది. స్కూల్ నేపథ్యంలో సాగనున్న ఈ కథ యంగ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉండనుంది.
ఇక సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ రాజ్’ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో గుర్తింపు పొందిన హీరో అబ్బాస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ వీడియో
బైట్ వెబ్ సిరీస్ (మార్చి 25)
ప్రెటీ లేథల్ (మూవీ – మార్చి 25)
హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 27)
ఓ రోమియో (హిందీ మూవీ – మార్చి 27)
విష్ణు విన్యాసం (తెలుగు మూవీ – మార్చి 20)
నెట్ ఫ్లిక్స్
హార్ట్ బ్రేక్ హై సీజన్ 3 (మార్చి 25)
హోమీ సైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 25)
ఇన్ సైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ రియాలిటీ షో – మార్చి 23)
సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 26)
ద రెడ్ లైన్ (థాయ్ మూవీ – మార్చి 26)
మర్దానీ 3 (బాలీవుడ్ మూవీ – మార్చి 27)
డిటెక్టివ్ హోల్ (నార్వేజియన్ సిరీస్ – మార్చి 26)
జియో హాట్ స్టార్
ది కమ్ బ్యాక్ (వెబ్ సిరీస్ – మార్చి 23)
డేర్ డెవిల్ బోర్న్ అగైన్ 2 (వెబ్ సిరీస్ – మార్చి 24)
కాట్టాన్ (తమిళ సిరీస్ తెలుగు డబ్బింగ్ – మార్చి 27)
ద హన్నా మొంటానా 20th యానివర్సరీ స్పెషల్ (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 24)
చిరాయ (వెబ్ సిరీస్).
జీ5
ప్రజాపతి 2 (బెంగాళీ మూవీ – మార్చి 27)
హే కాయ్ నవీన్ (మరాఠీ వెబ్ సిరీస్ – మార్చి 27)
భానుప్రియ భూటర్ హోటల్ (బెంగాళీ మూవీ – మార్చి 26)
యాపిల్ టీవీ
ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 27)
ఆహా
అమరావతికి ఆహ్వానం (మార్చి 20)
సన్ నెక్స్ట్ – సీతా పయనం (మార్చి 19)
ఈటీవీ విన్
సుమతీ శతకం (మార్చి 19)
సీతారాములు (మార్చి 22)
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు కాకపోయినా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే చిన్న సినిమాలు కూడా తమ కథ, కథనాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని చూస్తున్నాయి. మొత్తానికి, మార్చి చివరి వారంలో చిన్న సినిమాలే పెద్దగా ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ అవుతుందో చూడాలి