OTT Movies | ఈ వారం సినీ ప్రియులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ వారం కానుంది. థియేటర్లలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాలు, లవ్ ఎంటర్టైనర్లు విడుదలకు సిద్ధమవుతుండగా, ఓటీటీలో కూడా వివిధ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తం మీద థియేటర్, ఓటీటీ రెండింట్లోనూ ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. ముందుగా థియేటర్ల విషయానికి వస్తే, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఇందులో ప్రకాష్ రాజ్, సునీల్, అనురాగ్ కశ్యప్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
ఇక కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, ఎస్.జె. సూర్య, యోగి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ లవ్ ఎంటర్టైనర్పై మంచి అంచనాలు ఉన్నాయి. అదే రోజు మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన ‘పళ్లిచట్టంబి’ కూడా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించారు. ట్రైలర్ ద్వారా ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి స్పందన సాధించే అవకాశముంది.
ఇక ఓటీటీ విషయానికి వస్తే, ఈ వారం మొత్తం 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. నెట్ఫ్లిర్స్, అమెజాన్ ప్రైమ్, జీ 5, సోనీ లివ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో విభిన్న కంటెంట్ విడుదల అవుతోంది. వెబ్ సిరీస్‌లు, థ్రిల్లర్స్, లవ్ స్టోరీలు ఇలా అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో..
క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ – ఏప్రిల్ 10)
ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్ – ఏప్రిల్ 8)
నెట్ ఫ్లిక్స్
బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 8)
బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 9)
18th రోజ్ (మూవీ – ఏప్రిల్ 9)
తు యా మై (హిందీ మూవీ – ఏప్రిల్ 10)
త్రాష్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10)
సన్ నెక్స్ట్
హాళ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10)
కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10)
జీ5
ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ – ఏప్రిల్ 10)
జియో హాట్ స్టార్
తాయి కిళవి (తమిళ మూవీ – ఏప్రిల్ 10)
సోనీ లివ్
తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ – ఏప్రిల్ 10)
యాపిల్ టీవీ ప్లస్ – ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10)
లయన్స్ గేట్ ప్లే – వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ – ఏప్రిల్ 10)
మొత్తానికి ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీలో విభిన్న కంటెంట్‌తో ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది. ఎవరు థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో కూర్చొని ఓటీటీ చూస్తున్నా—ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ అని చెప్పాలి.