Oscar Challagariga: ‘ఆస్కార్ చల్లగరిగ’ అదుర్స్.. కేన్స్ చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఘనత
Oscar Challagariga: కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. డాక్యుమెంటరీ విభాగంలో విన్నర్ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్) గా నిలిచింది.
Oscar Challagariga: ప్రముఖ తెలుగు సినీ రచయిత చంద్రబోస్‌పై తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ఆస్కార్ చల్లగరిగ’ కేన్స్ చిత్రోత్సవంలో అదరగొట్టింది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. డాక్యుమెంటరీ విభాగంలో విన్నర్ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్) గా నిలిచిందని ప్రముఖ పాత్రికేయుడు చిల్కూరి సుశీల్ తెలిపారు. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. ఆస్కార్ చల్లగరిగె బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా నిలిచినందుకు గాను చంద్రబోస్ హర్షం వ్యక్తం చేశారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ పాట రాసినందుకు గాను రచయిత చంద్రబోస్‌తో పాటు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణీలకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత తన స్వంతగ్రామమైన భూపాలపల్లిలోని చల్లగరిగకు వచ్చినప్పుడు చంద్రబోస్‌ను ఆ గ్రామ ప్రజలు రిసీవ్ చేసుకున్న తీరు, ఆ గ్రామంతో ఆయనకుండే అనుభవాలను ఇతివృత్తంగా తీసుకుని సుశీల్ కుమార్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అమెరికా, జర్మనీ, కెనడా, బల్గేరియా, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, స్వీడన్, స్పెయిన్ వంటి దేశాల నుంచి వచ్చిన చిత్రాల పోటీని తట్టుకుని షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. తాజాగా విన్నర్‌గా నిలవడం గమనార్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

