Bigg Boss: నామినేషన్స్‌లో ఆ ఏడుగురు… ఒక్కరు మాత్రమే సేఫ్

సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగా జరిగింది. రవి- సన్నీ, శ్రీరామ్- సన్నీల మధ్య చాలా హాట్ డిస్కషన్స్ జరిగాయి.ముఖ్యంగా సన్నీని టార్గెట్ చేస్తూ హౌజ్‌మేట్స్ గేమ్ ఆడుతున్నారు. అతనిపై ఎన్ని విమర్శలు చేసిన ఎదురుదాడికి దిగి నిలుస్తున్నాడు. అతను ఫస్ట్ నామినేషన్స్‌లో భాగంగా మొదటిగా రవిని నామినేట్ చేశాడు . నువ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వరుసగా పనులు చెప్పావ్.. కెప్టెన్ అంటే పని చేయించడమే కాదు.. చేయడం కూడా అని చురకలేశాడు.
మనిషిని బ్లేమ్ చేయడానికి ముందుంటావ్.. మంచి చెప్పడానికి వెనుక ఉంటావ్.. నువ్ తప్పు చేస్తావ్.. వేరే వాళ్లకి వేలు చూపిస్తావ్.. ముందు ఆ వేలు కిందకి దింపు అని అన్నాడు సన్నీ. నువ్ కూడా వేలు చూపించరా? అంటూ రవి సీరియస్ అయ్యాడు. వేలు చూపిస్తూ ఉండటంతో నువ్ ముందు వేలు దించి మాట్లాడు అని సన్నీ కౌంటర్ ఇచ్చాడు. నువ్వే మోస్ట్ ఫేక్ పర్సన్‌వి. నీకు కామన్ సెన్స్ ఉండదు.. మళ్లీ నువ్ నాకు చెప్తున్నావ్.. అని సన్నీ క్లాస్ పీకాడు.
ఇక శ్రీరామ్తోను కొద్ది సేపు హాట్ డిస్కషన్ నడిచింది. ఇక సిరి.. రవి, ప్రియాంకలను నామినేట్ చేసింది. అయితే షణ్ముఖ్ ఎవర్నైతే నామినేట్ చేస్తాడో సిరి కూడా వాళ్లనే నామినేట్ చేస్తూ వస్తుంది.రవిని నామినేట్ చేస్తూ కాజల్ కుండబద్దలు కొట్టేసింది.. రవీ నీకు ధైర్యం లేదా? లేక జ్ఞాపక శక్తి లేదా? అని అడిగింది. రెండూ ఉన్నాయి అని చెప్పాడు రవి. నీకు రెండూ ఉంటే.. మాట చెప్పి చెప్పలేదని అనవు అని పేర్కొంది. ఇక శ్రీరామ్‌ని నామినేట్ చేస్తూ.. గేమ్ అయిపోయిన ఆనీ మాస్టర్ ఉసురు పోసుకున్నా అని అనడం ఏంటి? గేమ్‌లో ఉసురు ఏంటి? ఆ మాట నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది కాజల్.
మొత్తంగా 12 వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, షణ్ముఖ్ ఈ ఏడుగురు నామినేట్ అయ్యారు. మానస్ కెప్టెన్ కావడం వల్ల ఈ నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ఏడుగురు నామినేషన్లో ఉండడంతో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళతారా అనే ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

