పిల్లలు ఆడుకునేటప్పుడు సరదాగా వాడే మంత్రం ‘ఓం భీం బుష్’. ఈ పేరుతో ఓ చిత్రం రానుంది. ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్’ అనేది ఉపశీర్షిక. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. సునీల్ బులుసు నిర్మాత. మార్చి 22న విడుదల కానున్న ఈ సినిమాకు చెందిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు.
హీరోలు ముగ్గురూ కరపత్రాలతో ైస్టెలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. వీరంతా వ్యోమగామి దుస్తుల్లో ఉండటం విశేషం. ఈ విధంగా ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తిని రేకెత్తించారు ‘ఓం భీమ్ బుష్’ మేకర్స్. ఆద్యంతం వినోద ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రీతి ముకుందన్, అయేషాఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్.