తల్లాడ వెంకన్న, సునీత, శృతిక ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఒక్కడే నంబర్‌వన్’. శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు. తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్ నిర్మాతలు. ఈ చిత్రం పోస్టర్, టీజర్‌ను ఇటీవల మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ ‘ఈ సినిమాను పోలీస్‌ఆఫీసర్ కథతో రూపొందించడం అభినందనీయం.
ఈ చిత్రం ట్రైలర్‌ను చూశాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు. మరో అతిథి ఎమ్మెల్సీ బి.దయాకర్ మాట్లాడుతూ ‘ఈ చిత్ర కథానాయకుడు వెంకన్న పారిశ్రామికవేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పడు సినిమా రంగంపై దృష్టిపెట్టి సమాజానికి ఉపయోగపడేలా ఓ పోలీస్ ఆఫీసర్ కథను ఎంచుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఆయన ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు.