‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్‌సిరీస్‌తో తెలుగువారికి పరిచయమైంది నటి సిమ్రాన్ శర్మ. అంతకుముందు ‘ఇగో’ సినిమాలోనూ మెరిసింది. హిందీ వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న సిమ్రాన్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. తాజాగా ‘స్టాఫ్‌రూమ్’ అనే వెబ్‌సిరీస్‌లో కీలకపాత్రలో మెప్పించింది సిమ్రాన్. ‘స్టాఫ్‌రూమ్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా నటించాను. ఆ పాత్ర ద్వారే సిరీస్ అంతా నడుస్తుంటుంది. నా కెరీర్లో ఇది మంచి పాత్రగా నిలిచిపోతుంది’ అని నమ్మకంగా చెబుతున్నది సిమ్రాన్.
సినిమాల విషయం పక్కనపెడితే, క్యాజువల్ వేర్‌కే ప్రాధాన్యం ఇస్తానంటున్నది. ‘కురుచ దుస్తులు ధరించడం అంటే నాకు చిరాకు. అలాగని ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవ్వననీ చెప్పను. నా శరీరాకృతికి నప్పే దుస్తులను ఇష్టపడతాను. నా వార్డ్‌రోబ్‌లో బ్లాక్ అండ్ వైట్ కలెక్షన్ ఎక్కువ. ఆ రెండు రంగులూ చాలా ఇష్టం. ఇక డెనిమ్ జాకెట్ రెగ్యులర్‌గా వేసుకుంటాను’ అని తన ఫ్యాషన్ ఆసక్తులను వెల్లడించింది సిమ్రాన్.