OG Movie Glimpse | రీసెంట్గా బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఆయన నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ (OG). రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి చాలా రోజులకు కొత్త అప్డేట్ ఇచ్చారు.
నేడు దీపావళి పండుగ.. ఈ సందర్భంగా ఓజీ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్‌తో పాటు మేకర్స్ జపనీస్ భాషలో (ディーパバリ・シュバカカンシャル ) దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ディーパバリ・シュバカカンシャル 🪔#TheyCallHimOG pic.twitter.com/9odl5XtxcM
— DVV Entertainment (@manchididengey) November 12, 2023
”పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా అంటూ” బ్యాక్ గ్రౌండ్లో చెబుతున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో కొత్తగా కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారు. ఓజీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి.