OG Movie | బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యాని ప్యాకెట్ దొరికితే ఏ రేంజ్లో సంతోష పడతారో.. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇన్నాళ్లు రీమేక్‌లతో వెజ్ మీల్స్ తిని తిని నాలుక చచ్చుబడి పోయిన ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ అంటూ జంబో సైజ్ ప్యాక్ ధమ్ బిర్యాని పెట్టాడు సుజీత్. ఆకలితో వేటాడే పులిని చూస్తారా అంటూ.. నిజంగానే పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ గురించి ఇంత చర్చ జరగడం ఎప్పుడూ చూడలేదు. నాలుగు రోజులు కిందట రిలీజైన ఓజీ టీజర్ పెను సంచలనమే సృష్టించింది. పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రయిట్ సినిమా వస్తే ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో ఓజీ టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది.
ఎప్పుడు రిలీజవుతందనేది పక్కన పెడితే.. ఎప్పుడు రిలీజైన బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ రావడం పక్కా అని కన్ఫర్మ్ అయిపోయింది. అసలైన ఫ్యాన్ బాయ్ సంభవం అంటే ఏంటో సుజీత్ చూపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ను ‘ఐఎమ్‌డీబి’ అఫీషియల్ వెబ్ సైట్లో రాసుకొచ్చింది. ‘ఓజాస్ గంభీర అనే ఓ టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. క్రైమ్, మాఫియాలలో రారాజుగా ఎదుగుతాడు. ఆ ప్రయాణంలో తన ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. దాంతో తన ఫ్యామిలీని అంతమొందించిన వారిని చంపడానికి నడుం బిగిస్తాడు. కేవలం చంపడమే కాకుండా ఆ విలన్ల సమ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడు. వాళ్లు చేసే ఇల్లీగల్ దందాలన్నిటిని కూకటి వేల్లతో పెకలించేస్తాడు’ అంటూ ప్రముఖ పాపులర్ సినిమా వెబ్ సైట్ ‘IMDB’ రాసుకొచ్చింది.
ఈ కథలో నిజమెంతుందో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ స్టోరీ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మట్టుకు ఇప్పటికే ఇలాంటి కథను మనం ఎన్నో సార్లు విన్నాం. చూశాం. ఇలాంటి రెగ్యులర్ కథతో వచ్చి సుజీత్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. మాములుగా సుజీత్ సినిమాల స్క్రీన్‌ప్లే ఓ రేంజ్లో ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. కట్టిపడేసే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను మాయ చేస్తాడు. ఇక ఇందులోనూ అలాంటి మాయ ఏదైనా చేస్తాడో చూడాలి. అయితే ఇదే కథ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మాములుగా ఐఎమ్డీమి సంస్థ పలువురు సినీ విశ్లేషకుల నుంచి సేకరించిన డేటానే ఇందులో పోస్ట్ చేస్తుంది.