OG 2 | ‘ఓజి 2’పై సెన్సేషనల్ బజ్.. నవంబర్ నుంచే పవన్ కళ్యాణ్ షూటింగ్
OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజి 2’ ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజి’ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పగా, విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజి 2’ ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజి’ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పగా, విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్‌ను గతంలో ఎప్పుడూ చూడని అవతారంలో సుజీత్ చూపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘ఓజి’ సినిమా ముగింపు సమయంలోనే రెండో భాగానికి సంబంధించిన ఆసక్తికర సంకేతాలు ఇవ్వడంతో అభిమానులు అప్పటి నుంచే ‘ఓజి 2’ కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న సమాచారం వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఓజి 2’పై మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఈ ఏడాది నవంబర్ నెల నుంచి ‘ఓజి 2’ షూటింగ్ కోసం తేదీలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో పాటు ఇతర కమిట్మెంట్లను పూర్తి చేస్తున్న ఆయన, నవంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగం ప్రధానంగా భారతదేశం నేపథ్యంలో సాగగా, రెండో భాగాన్ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించేందుకు సుజీత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కథలో అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్లు ఉండనున్నాయని, అందుకే విదేశాల్లోనూ కీలక షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా ఈ విదేశీ షెడ్యూల్స్‌లో పాల్గొనే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
‘ఓజి’లో ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించి అభిమానులను అలరించారు. సినిమా చివర్లో జపాన్ నేపథ్యంలో కథకు సంబంధించిన కొన్ని కీలక సూచనలు ఇవ్వడంతో రెండో భాగంపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ‘ఓజి 2’ కథపై దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ‘ఓజి 2’కు సంబంధించిన అధికారిక ప్రకటన లేదా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే అభిమానులకు ఇది పెద్ద పండుగ కానుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. షూటింగ్ ప్రారంభ తేదీలు, విదేశీ షెడ్యూల్స్, బర్త్‌డే అప్డేట్ వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ ‘ఓజి 2’పై వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Health
- OG
- OG 2
- Pawan Kalyan
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

