Tamannaah Bhatia | ఓదెల మల్లన్న గుళ్లో బోనాల జాతర
‘ఓదెల రైల్వేస్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా ఇందులో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నది. అశోక్‌తేజ దర్శకుడు. ముధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్‌వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటం విశేషం.
‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా ఇందులో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నది. అశోక్‌తేజ దర్శకుడు. ముధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్‌వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నది. అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో ైక్లెమాక్స్ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు.
సినిమాకు ఈ ఎపిసోడ్ అత్యంత కీలకమని, అందుకే ఖర్చుకు వెనుకాడటం లేదని మేకర్స్ తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఉంటుందని, బోనాల టైమ్‌లోనే ఈ షూటింగ్ జరగడం కోఇన్సిడెంట్ అని దర్శకుడు చెప్పారు. ఈ సందర్భంగా చీరకట్టుకొని, తలపై బోనం మోస్తూ ఉన్న తమన్నా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు సంపత్‌నంది గైడెన్స్‌తో ప్రతిష్టాత్మకంగా అశోక్‌తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహ, యువ, నాగమహేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, సంగీతం: అజనీశ్ లోకనాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

