NTR | అభిమాని పిల్లల కోసం స్వయంగా చేసిన కుకీస్ పంపిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న చిన్నారుల క్యూట్ వీడియో
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తొలిసారిగా స్వయంగా కుకీస్ తయారు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తారక్, ఇప్పుడు ఓ అభిమాని కోరికను నెరవేర్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ తాను స్వయంగా కుకీస్ తయారు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించగా, సాయి తేజ అనే అభిమాని సరదాగా స్పందిస్తూ, “అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ల కోసం రెండు కుకీలు పంపించండి” అని కామెంట్ చేశాడు.
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తొలిసారిగా స్వయంగా కుకీస్ తయారు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తారక్, ఇప్పుడు ఓ అభిమాని కోరికను నెరవేర్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ తాను స్వయంగా కుకీస్ తయారు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించగా, సాయి తేజ అనే అభిమాని సరదాగా స్పందిస్తూ, “అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ల కోసం రెండు కుకీలు పంపించండి” అని కామెంట్ చేశాడు.అభిమాని కామెంట్‌ను గమనించిన ఎన్టీఆర్ వెంటనే “అడ్రస్ పెట్టు” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. మొదట ఇది సరదా సమాధానమేనని భావించిన అభిమానులు, తర్వాత జరిగిన సంఘటనతో ఆశ్చర్యపోయారు. తారక్ స్పందనకు ఉప్పొంగిపోయిన సాయి తేజ తన ఇంటి అడ్రస్‌ను పంపించగా, కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ స్వయంగా తయారు చేసిన కుకీస్‌తో పాటు ఆయన ఆటోగ్రాఫ్ కూడా వారి ఇంటికి చేరాయి.
ఈ అనూహ్యమైన కానుక అందుకోవడంతో సాయి తేజ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా చిన్నారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కుకీస్‌ను పిల్లలు తింటున్న వీడియోను సాయి తేజ సోషల్ మీడియాలో షేర్ చేశారు.వీడియోలో పిల్లలను “కుకీస్ ఎలా ఉన్నాయి?” అని అడగగా, “చాలా బాగున్నాయి” అంటూ వారు ఆనందంగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా “తారక్ మామ అంటే చాలా ఇష్టం” అని ముద్దు ముద్దుగా చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులపై ఎన్టీఆర్ చూపించే ప్రేమ, ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరో స్థాయిలో ఉన్నప్పటికీ అభిమానుల చిన్న కోరికను కూడా గుర్తుంచుకుని స్వయంగా స్పందించడం తారక్ గొప్ప మనసుకు నిదర్శనమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తన వినయం, అభిమానులతో సన్నిహితంగా ఉండే స్వభావంతో ప్రత్యేక గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్, ఈ చిన్న సంఘటనతో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK
— saiteja (@saitejaathoti) June 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

