Ntr- Shankar | పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ హీరోగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, దేవర వంటి సినిమాలతో ఆయన మార్కెట్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. మరోవైపు, భారీ బడ్జెట్ సినిమాలు, సోషల్ మెసేజ్‌లతో కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో శంకర్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి, ఎన్టీఆర్ తన కెరీర్ ప్రారంభ దశలోనే శంకర్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని బలంగా కోరుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. శంకర్ స్టైల్ సోషల్ ఎలిమెంట్స్‌కు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ జత అయితే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేదని అప్పట్లోనే చర్చలు నడిచాయి.
అయితే ఆ క్రేజీ కాంబినేషన్ అప్పట్లో సాధ్యపడలేదు. ఇద్దరి కాల్షీట్లు కుదరకపోవడం, అప్పటి పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ప్రస్తుతం మళ్లీ ఈ కాంబోపై చర్చలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, శంకర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణంగా శంకర్ ఇటీవల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోవడమేనని చెబుతున్నారు.
ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో, శంకర్‌తో పని చేయడంపై ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారని సమాచారం. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌ను గ్లోబల్ స్థాయిలో విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.